వేటగాళ్ల చేతిలో చిరుత హతం! తర్వాత పెద్ద ప్లానే వేశారు?
అడవి జంతువుల కోసం వేటగాళ్లు తరచుగా వలలు వేస్తుంటారు. ఈ వలలో అప్పుడప్పుడు క్రూర మృగాలు కూడా చిక్కుకుంటుంటాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: అడవి జంతువుల కోసం వేటగాళ్లు తరచు వలలు వేస్తుంటారు. ఈ వలలో అప్పుడప్పుడు క్రూర మృగాలు కూడా చిక్కుకుంటుంటాయి. అయితే ఆ జంగతువులను వేటగాళ్లు చంపి.. ఆపై కళేబరాన్ని మాయం చేయాలనే ఉద్దేశంతో దహనం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల అటవీ జంతువుల కోసం వేటగాళ్లు పెట్టిన వలలో పడి చిరుత మృతి చెందింది. ఈ ఘటన జరిగిన నెల రోజులకు విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
దౌల్తాబాద్, చేగుంట సరిహద్దు ప్రాంతంలోని అడవిలో వేటకు వెళ్లిన పలువురు అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన వలలో చిరుత చిక్కింది. వేటగాళ్లు చిరుతను కర్రలతో కొట్టి చంపి కళేబరాన్ని దహనం చేశారు. ఈ విషయం గురించి బహిరంగ చర్చ జరగడం మొదలైంది. దీంతో విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.