బీసీ వ్యవసాయ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ పోస్టులు! సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు

వనపర్తి, కరీంనగర్ జిల్లాలలోని బీసీ గురుకుల మహిళా వ్యవసాయ కళాశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన లెక్చరర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Update: 2024-09-04 16:25 GMT

బీసీ వ్యవసాయ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ పోస్టులు! సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు

దిశ; తెలంగాణ బ్యూరో: వనపర్తి, కరీంనగర్ జిల్లాలలోని బీసీ గురుకుల మహిళా వ్యవసాయ కళాశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన లెక్చరర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విధులు నిర్వహించేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నామన్నారు. కరీంనగర్, వనపర్తి గురుకుల వ్యవసాయ కళాశాలల్లో (ఒక్కొక్కటి చొప్పున) అగ్రానమీ (2), లైవ్ స్టాక్, ఎనిమల్ హస్బెండ్రీ(2), జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్(2), ఎంటోమోలజీ (2), అగ్రికల్చరల్ ఎకనామిక్స్(2), ప్లాంట్ పాథాలజీ (2), అగ్రికల్చరల్ ఎక్సటెన్షన్ (2) పోస్టులను భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు. అభ్యర్ధులు సంబంధిత విభాగంలో పీహెచ్ డీ, ఎంఎస్సీ (అగ్రికల్చర్) చేసి ఉండాలన్నారు. లైవ్ స్టాక్, ఎనిమల్ హస్బండ్రీ పోస్టుకు పీహెచ్ డీ, ఎంవీఎస్సీ చేసి ఉండాలన్నారు. పీహెచ్డీ, నెట్ అర్హత కలిగి ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు. ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్ధులు ఈనెల 13వ తేదీ లోగా తమ పూర్తి వివరాలను (CV/Resume. Academic profile) mjpkrnagbsc2022@gmail.com కి మెయిల్ చేయాలని ప్రకటించారు. మరిన్ని వివరాల కోసం 76809 41504  నెంబర్ ను సంప్రదించాలని ఆయన సూచించారు.


Similar News