‘వీరముష్టి కులాన్ని సంచార జాబితాలో చేర్చాలి’
వీరభద్రీయ, వీరముష్టి కులాన్నీ కేంద్ర సంచార జాబితా (డీ నోటిఫైడ్ నోమాడిక్ ట్రైబ్స్)లో చేర్చాలని అఖిల భారత వీరభద్రీయ వీరముష్టి సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: వీరభద్రీయ, వీరముష్టి కులాన్నీ కేంద్ర సంచార జాబితా (డీ నోటిఫైడ్ నోమాడిక్ ట్రైబ్స్)లో చేర్చాలని అఖిల భారత వీరభద్రీయ వీరముష్టి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. కిషన్ రెడ్డి స్పందించి వీరభద్రీయ, వీరముష్టి కులాన్ని కేంద్ర (డీఎన్‌టీ) సంచార జాబితాలో చెర్చే విషయంమై మినిస్ట్రీస్ అఫ్ సోషల్ జస్టిస్ సహాయ మంత్రి ప్రతిమ భూమిక్‌కి ఫోన్ చేసి కులాని కేంద్ర సంచార జాతుల జాబితాలో చేర్చాలని లెటర్ ఇచ్చారని సంఘం నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాతీయ వీరభద్రీయ వీరముష్టి కుల అధ్యక్షుడు కాటపల్లి రాజేశ్వర్ రావు, తెలంగాణ వీరబద్రియ వీరముష్టి సంఘం అధ్యక్షుడు కాటపల్లి వీరస్వామి, జాతీయ కమిటీ కార్యదర్శి పొన్నాల శివరాజ్, కోశాధికారి గండి స్వామి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కొండయ్య, ఉపాధ్యక్షుడు యాదయ్య, ఎల్లయ్య, కోశాధికారి రవికుమార్, కార్యదర్శి జంగయ్య తదితరులు పాల్గొన్నారు.