బీఆర్ఎస్తో పొత్తుపై CPI నేత కూనంనేని కీలక వ్యాఖ్యలు..
బీఆర్ఎస్తో పొత్తుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్డెస్క్: బీఆర్ఎస్తో పొత్తుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్తో పొత్తు విషయంలో తమకు ఒక అవగాహన ఉందని.. ఎవరు ఎక్కడ పోటీ చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని తెలిపారు. ఒకవేళ బీఆర్ఎస్తో పొత్తు ఉంటే సీట్ల సంఖ్య తగ్గించుకుంటామని చెప్పారు. లేదంటే మా పోరాటం మేం చేస్తామని కూనంనేని స్పష్టం చేశారు. కాగా, మునుగోడు ఉపఎన్నికలో అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సీపీఐ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.