ఎప్పుడూ రాజకీయాల ధ్యాసే.. ప్రధాని మోడీపై కేటీఆర్ సెటైర్లు!

మంత్రి కేటీఆర్ మరోసారి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. చైనా నుంచి దూరమవుతున్న వ్యాపార సంస్థలను తనవైపు ఆకర్షించడంలో భారత్

Update: 2023-03-25 11:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కేటీఆర్ మరోసారి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. చైనా నుంచి దూరమవుతున్న వ్యాపార సంస్థలను తనవైపు ఆకర్షించడంలో భారత్ విఫలం అయిందంటూ పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన నివేదికపై కేటీఆర్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా శనివారం రియాక్ట్ అయిన ఆయన మోడీ, కేంద్ర ప్రభుత్వంపై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఆర్థిక అంశాలకంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యత ఇస్తే రిజల్ట్ ఇలానే ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

టెలి పాంప్టర్ ప్రసంగాలు చేయడం సులభమే కానీ ఫలితాలను సాధించడమే కష్టం. లక్ష్యాంపై ప్రయత్నాలు చేస్తే తప్ప రిజల్ట్ రాదు. కేంద్ర ప్రభుత్వ తీరు వల్ల పెద్ద సంఖ్యలో భారతీయ యువతకు తీరని లోటు అని ధ్వజమెత్తారు. కాగా చైనా ప్రభుత్వం అవలంభిస్తున్న ప్లస్ వన్ వ్యూహం కారణంగా పలు బహుళజాతి సంస్థలు ఆ దేశం నుంచి తయారీ, ఉత్పత్తిని వియత్నాం, థాయ్‌లాండ్, కంబోడియా, మలేషియా వంటి ఇతర ఆగ్నేయాసియా దేశాలకు తరలించాయని ఈ నివేదిక పేర్కొంది. వారిని ఆకర్షించడంలో భారత్ విఫలం అయిందని నివేదిక స్పష్టం చేసింది.

Tags:    

Similar News