తక్షణమే చర్యలు తీసుకోండి.. సీఎస్‌కు కేటీఆర్ కంప్లైంట్
ప్రభుత్వ వెబ్సైట్లు, డిజిటల్ విధ్వంసంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా స్పందించారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ వెబ్సైట్లు, డిజిటల్ విధ్వంసంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా స్పందించారు. తక్షణమే జోక్యం చేసుకోవాలని సీఎస్ శాంతి కుమారిని కోరారు. కేసీఆర్ హయాంలోని సమాచారం, వివరాలు తొలగించారని అన్నారు. గత ప్రభుత్వ సమాచారం, వివరాలు రాష్ట్ర ప్రజల ఆస్తి అని చెప్పారు. భావి తరాల కోసం ఈ డిజిటల్ సంపదను రక్షించాలని కోరారు. వెంటనే సీఎస్ తగిన చర్యలు తీసుకోకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్తామని అన్నారు. కాగా, గతంలోనూ అధికారిక వెబ్సైట్ల నుంచి ముఖ్యమైన సమాచారం మాయం అవుతోందని ఆరోపించారు. దీని వెనుక పాలకుల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ సీఎంగా పరిపాలన సాగించారని కేసీఆర్ పరిపాలనకు సంబంధించిన సమాచారాన్ని వేల కొలది ఫొటోలు, వీడియోలను వెబ్సైట్లు సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు.