KTR: అవును.. ఆ లొట్టపీసు కేసుకు భయపడేది లేదు: మరోసారి కేటీఆర్ హాట్ కామెంట్స్

సీఎం రేంవంత్ రెడ్డి (CM Revanth Reddy) పెట్టిన లొట్టపీపీసు కేసకు భయపడేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు.

Update: 2025-01-08 08:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేంవంత్ రెడ్డి (CM Revanth Reddy) పెట్టిన లొట్టపీపీసు కేసుకు భయపడేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లో డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 2001లో పార్టీ పెట్టినప్పుడు ఉన్న ఇబ్బందుల కంటే ఇప్పుడు ఉన్న ఇబ్బందులు పెద్దవి ఏమి కాదన్నారు. ఫార్ములా ఈ-రేసు కేసు (Formula E-Race Case) ఓ లొట్టపీసు కేసని.. ఆ కేసుతో ఏం కాదని అన్నారు. ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నామని.. వాటి ముందు ఇవి చాలా చిన్నవేనని తెలిపారు. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ (KCR) ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో ఎదిగిన తమకు ఇలాంటివి పెద్ద సమస్య కాదని కొట్టిపడేశారు.

రాష్ట్రంలో తీడీ పాలన నడుస్తోందని అన్నారు. త్రీడీ అంటే డిసెప్షన్.. డిస్ట్రాక్షన్.. డిస్ట్రక్షన్ అని ఎద్దేవా చేశారు. కేసులు తమకు సమస్యే కాదని.. ప్రభుత్వాన్ని నిలదీయడమే తమ పని అని అన్నారు. కేసు విషయాన్ని తాను చూసుకుంటానని.. కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల సందర్భంగా రూ.15 వేలు పంట పెట్టుబడి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఇప్పుడు రూ.12వేలు మాత్రమే ఇస్తానంటోందని అన్నారు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రుణమాఫీపై మాట తప్పారని ఎద్దేవా చేశారు.

రుణమాఫీపై బీఆర్ఎస్(BRS) సవాల్ చేసినా ఇప్పటి వరకు ఏ ఒక్క కాంగ్రెస్ (Congress) నేత కూడా స్పందించలేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ (KCR) తయారు చేసిన సైనికుడిగా.. ఆయన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డగా చెబుతున్నా ప్రస్తుత పరిస్థితులు తనకు ఇబ్బంది కాదని అన్నారు. కేసుల గురించి కోర్టుల్లో తేల్చేకుందామని.. ప్రభుత్వంపై జనాల్లోకి కొట్లాడుదామని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. త్వరలోనే బూత్ నుంచి రాష్ట్ర స్థాయి కమీటీలు వేసుకుందామని.. జిల్లా నాయకులు రాష్ట్రానికి రావడం కాదని. తామే జిల్లాలకు వెళ్తామని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా పనిచేసే పార్టీ బీఆర్ఎస్ అని.. ఉమ్మడి రాష్ట్రంలోనే తమకు బాగుందని మాట్లాడటం మన ఖర్మ అని కేటీఆర్ కామెంట్ చేశారు.

Tags:    

Similar News