KTR: అలా చేస్తారనే లాయర్లతో వచ్చా.. కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్

ఫార్ములా ఈ-రేసు కేసు (Formula E-Race Case)లో ఇవాళ ఏసీబీ (ACB) విచారణకు హాజరైన బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-01-06 06:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేసు కేసు (Formula E-Race Case)లో ఇవాళ ఏసీబీ (ACB) విచారణకు హాజరైన బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విచారణ సందర్భంగా తనతో పాటు లాయర్లను అనుమతిస్తేనే విచారణకు హాజరు అవుతానని ఏసీబీ అడిషనల్ ఎస్పీకి వివరణ ఇచ్చానని కేటీఆర్ (KTR) తెలిపారు. ప్రస్తుతం తన క్వాష్ పిటిషన్ హైకోర్టు (High Court)లో ఉందని అన్నారు. ‘రైతు భరోసా’ (Raithu Bharosa) నుంచి టాపిక్ డైవర్ట్ చేసేందుకే ప్రభుత్వం ఈ డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు. ఇటీవల పట్నం నరేందర్ రెడ్డి కేసు విచారణ సందర్భంగా తప్పుడు స్టేట్‌మెంట్లు ఇచ్చిన పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే తాను లాయర్లతో కలిసి ఏసీబీ (ACB) విచారణకు వచ్చానని అన్నారు. తనను విచారణకు పిలిచి తన ఇంటిపై రెయిడ్స్‌ (Raids)కు ప్లాన్ చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇంట్లో వాళ్లే ఏదో ఒకటి పెట్టి కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

కాగా, ఇవాళ ఏసీబీ (ACB) విచారణకు హాజరైన ఆయన అధికారులకు లిఖితపూర్వకంగా రిప్లై ఇచ్చారు. అందులో ఏసీబీ కేసు ఇప్పటికే హైకోర్టు (High Court)లో ఛాలెంజ్ చేశామని తెలిపారు. క్వాష్ పిటిషన్‌ (Quash Petition)పై తీర్పును రిజర్వ్ చేసిందని అన్నారు. ఏ క్షణమైనా హైకోర్టు (High Court) తీర్పు రావొచ్చని అందులో పేర్కొన్నారు. ఇదే సమయంలో ఏసీబీ (ACB) అధికారులు తనకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఈ క్రమంలోనే కేసుకు సంబంధించి డాక్యుమెంట్లను ఏసీబీ కోరిందని.. అందుకు తాను ఎలాంటి సమాచారం కావాలి.. ఏ డాక్యుమెంట్లు ఇవ్వాలో చెప్పాలని ఏసీబీ అధికారులను అడిగానని, కానీ ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సమాధానం లేదని అన్నారు. హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు ఇన్వెస్టిగేషన్ ఆపాలంటూ కేటీఆర్ తన రిప్లైలో ప్రస్తావించారు.

Tags:    

Similar News