KTR: పోలీసులే దొంగల్లెక్క ఇళ్ల మీద పడ్డారు.. మాజీమంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్
పోలీసులే దొంగల్లెక్క ఇళ్ల మీద పడ్డారని, దొరికిన వాళ్లను దొరికినట్టు జైళ్లో వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: పోలీసులే దొంగల్లెక్క ఇళ్ల మీద పడ్డారని, దొరికిన వాళ్లను దొరికినట్టు జైళ్లో వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. లగచర్ల(Lagacharla)లో రైతుల అరెస్ట్(Farmers Arrest) లపై ఓ వృద్ధురాలు మాట్లాడిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనిపై కేటీఆర్.. కళ్లుండీ చూడలేని, చెవులుండీ వినలేని, బధిరాంధక రేవంత్ ప్రభుత్వపు(Revanth Govt) దాష్టీకానికి మచ్చుతునక ఇది అని తెలిపారు.
రెక్కాడితేనే కానీ డొక్కాడని ఆ పేద గిరిజనుల భూముల మీద రేవంత్(CM Revanth Reddy) కన్నేసిండని, మా భూములు గుంజుకోవద్దన్నందుకు, పోలీసులే దొంగల్లెక్క అర్ధరాత్రి ఆ నిస్సహాయుల ఇళ్ల మీద పడ్డారని ఆరోపించారు. అంతేగాక గడ్డపారలతో వారి ఇండ్ల తలుపులు విరగ్గొట్టారని, ఇంట్లో ఉన్న బీరువాను కూడా వదలకుండా పగలగొట్టారని చెప్పారు. ఇక కళ్లు సరిగ్గా కనిపించని ఈ ముసలమ్మ చేతి కర్రను లాగి విసిరేశారని, దొరికినవాళ్లను దొరికినట్టు నిర్బంధించి చిత్రహింసలు పెట్టి, జైళ్లో వేశారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం(Public Government) పేరున గద్దెనెక్కి.. ప్రజా కంటకుడిగా మారిన రేవంత్ నిర్వాకమిది అని మాజీమంత్రి రాసుకొచ్చారు.