ఇలాంటి కేంద్రమంత్రిని నేనెప్పుడూ చూడలేదు: KTR

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి‌పై మంత్రి కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా కిషన్ రెడ్డిపై అసహనం వ్యక్తం చేశారు.

Update: 2022-10-01 05:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి‌పై మంత్రి కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా కిషన్ రెడ్డిపై అసహనం వ్యక్తం చేశారు. ''ప్రియమైన కిషన్ రెడ్డి బీజేపీ గారు. నేను మిమ్మల్ని సోదరునిగా గౌరవిస్తాను. కానీ.. ఇంతలా తప్పుడు సమాచారం చేరవేస్తూ, అబద్దాలాడే కేంద్రమంత్రిని నేను చూడలేదు. తెలంగాణకు భారత ప్రభుత్వం 9 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిందని మీరు ప్రకటించారు, ఇది అబద్ధం. మీకు క్షమాపణ చెప్పే ధైర్యం కూడా లేదు' అని శనివారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఫైర్ అయ్యారు.

''హైదరాబాదులో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు మీరు ప్రకటించారు. ఎప్పటిలాగే, మీ గుజరాతీ బాస్‌లు దానిని వారి రాష్ట్రానికి మార్చారు మళ్ళించారు. మీరేమో ఇంకా హైదరాబాద్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అయినప్పటికీ మీరు మీ తప్పుడు వాదనను సరిదిద్దుకోలేదు. మీ అరకొర తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తూ, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో వాగ్దానం చేసినట్లుగా బయ్యారంలో సమీకృత ఉక్కు కర్మాగారం ఆచరణ సాధ్యం కాదని మీరు ఇప్పుడు క్లెయిమ్ చేయడం ప్రారంభించారు. మీరు గుజరాత్‌లోని మీ అధికారులను సంతోషపెట్టడానికి అర్ధ సత్యాలు & తప్పుడు వార్తలను ప్రచారం చేసే వ్యక్తి అని స్పష్టంగా తెలుస్తుంది. కావున, తెలంగాణా ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను భారత ప్రభుత్వం ఎందుకు తుంగలో తొక్కుతున్నదో గౌరవనీయులైన ప్రధాని మోదీ గారిని అధికారికంగా ప్రకటించాలని మేము కోరుతున్నాము. ఏపీఆర్‌ఏలో తెలంగాణకు గానీ, మన సోదర రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు గానీ ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకపోవడం సిగ్గుచేటు.'' అంటూ మరో ట్వీట్‌లో కేటీఆర్ మండిపడ్డారు.

Also Read: సర్కార్ కీలక ఉత్తర్వులు.. గిరిజనులకు కేసీఆర్ దసరా గిప్ట్ 

Tags:    

Similar News