KTR: మాస్కోలో ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ ఫ్యూచర్‌ పోర్టల్‌’లో ప్రసంగించేందుకు కేటీఆర్‌కు ఆహ్వానం

మాస్కోలో ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ ఫ్యూచర్‌ పోర్టల్‌’లో ప్రసంగించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వానం అందింది.

Update: 2024-08-28 12:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాస్కోలో ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ ఫ్యూచర్‌ పోర్టల్‌’లో ప్రసంగించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. రష్యాలోని మాస్కో లో Skolkovo.StartUp సంస్థ ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో పాల్గొని ప్రసంగించాలంటూ కేటీఆర్‌ను ఆహ్వానించారు. ఫ్యూచరిస్టిక్ అంశాల్లో భవిష్యత్‌లో ఉండే అవకాశాలు, వాటిని వినియోగించుకునే విధానాలపై 30 నిమిషాల పాటు మాట్లాడాలంటూ కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించటం విశేషం. రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5 నుంచి 7వ తేదీ వరకు 2024 వరకు ‘ఫెస్టివల్ ఆఫ్ ది ఫ్యూచర్ పోర్టల్ 2030-2050’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 


Similar News