ఏసీబీ ఆఫీస్ వద్ద భారీ పోలీసు భద్రత.. ఎందుకంటే..?

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఈ రోజు ఉదయం.. ఏసీబీ విచారణకు హాజరు కానున్నాడు.

Update: 2025-01-06 03:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఈ రోజు ఉదయం.. ఏసీబీ విచారణకు హాజరు కానున్నాడు. ఈ నేపథ్యంలో ఏసీబీ ఆఫీస్(ACB office) వద్ద భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని బీఆర్ఎస్(BRS) నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు(House arrests) చేశారు. అలాగే ఏసీబీ ఆఫీస్ వద్ద రిస్ట్రిక్షన్స్ అమలు చేశారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఫార్ములా ఈ-రేస్ కేసు(Formula E-Race Case)లో కేటీఆర్‌(KTR)కు ఏసీబీ(ACB) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని శుక్రవారం జారీ చేసిన నోటీసుల్లో ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. కేటీఆర్‌తో పాటు బీఎల్‌ఎన్ రెడ్డి(BLN Reddy), అర్వింద్ కుమార్‌(Arvind Kumar)లకు కూడా నోటీసులు జారీ చేశారు. కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాత వారిని విచారించనున్నట్లు సమాచారం అందుతోంది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ ను అరెస్ట్ చేస్తారేమోనని బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన నెలకొంది.


Similar News