కేటీఆర్ అబ‌ద్దాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారారు: మంత్రి సీతక్క

అబ‌ద్దాల‌కు అంబాసిడ‌ర్ గా మారిన కేటీఆర్.. సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం విష‌యంలో అవాకులు చ‌వాకులు పేలుతున్నారని ఆయన ట్వీట్టర్‌లో పేర్కొన‌ట్లుగానే సీఎం బ్రేక్ ఫాస్ స్కీంను ఫార్స్‌గా మార్చిందే వారని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విమర్శించారు.

Update: 2024-09-11 17:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అబ‌ద్దాల‌కు అంబాసిడ‌ర్ గా మారిన కేటీఆర్.. సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం విష‌యంలో అవాకులు చ‌వాకులు పేలుతున్నారని ఆయన ట్వీట్టర్‌లో పేర్కొన‌ట్లుగానే సీఎం బ్రేక్ ఫాస్ స్కీంను ఫార్స్‌గా మార్చిందే వారని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. తొమ్మిద‌న్నరేళ్లు అధికారంలో ఉండి ఏనాడు ప్రభుత్వ పాఠ‌శాల పిల్లల ఆక‌లిని ప‌ట్టించుకోని ఆయన.. ఎన్నిక‌ల షెడ్యుల్‌కు కేవ‌లం మూడంటే మూడు రోజుల ముందే మొక్కుబ‌డిగా వేల్ల మీద లెక్కబెట్టేట‌న్ని పాఠ‌శాల‌ల్లో ప్రారంభించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.

ఎలాంటి మార్గదర్శకాలు, ఎటువంటి బడ్జెట్ కేటాయింపులు లేకుండానే ఎన్నికల లబ్ధి కోసం హడావుడిగా సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టి నయా పైసా ఖ‌ర్చు చేయ‌కుండా ఆరంభ శూరత్వంగా మార్చి పురిట్లోనే చంపేశారన్నారు. ఏజెన్సీల‌కు అప్పటి ప్రభుత్వం రూ.3.5 కోట్లను ప్రజా ప్రభుత్వం చెల్లించిందరని, తమరి పాల‌న‌లో విద్యా వ్యవ‌స్థను బ్రష్టు ప‌ట్టించి ఇప్పుడు పేద పిల్లల మీద ప్రేమ ఒలుక బోయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో 24.85 లక్షల మంది విద్యార్దులుంటే.. వారు దిగిపోయే నాటికి 18.06 లక్షలకు విద్యార్దుల సంఖ్య ప‌డిపోయిందని గుర్తు చేశారు. అది వారి ప్రభుత్వ నిర్వాకమని.. తమరు ప్రభుత్వ విద్యను అంత ఉద్దరిస్తే విద్యా రంగంలో మ‌న రాష్ట్రం 34 వ స్థానంలోకి ఎందుకు దిగ‌జారింది? ఆ పాపం మీది కాదా? అంటూ ప్రశ్నించారు.

దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని అమలు చేయాల‌ని కేంద్ర ప్రభుత్వమే నియమించిన నిపుణుల క‌మిటీ సిఫార్సు చేసిందని.. ఆ నివేదిక‌ను గుర్తు చేస్తూ.. బ్రేక్ ఫాస్ట్ స్కీంను ప్రవేశపెట్టాల‌ని కేంద్రాన్ని కోరితే వారికొచ్చిన అభ్యంత‌రం ఏంటో? అని నిలదీశారు. కేంద్రం మీద ఈగ కూడా వాల‌నీయ‌కుండా ఎందుకు కాపాడుతున్నారని అడిగారు. రాష్ట్రాల నుంచి ప‌న్నులు, శిస్తుల రూపంలో కేంద్రానికి నిధులు వెళుతున్నప్పుడు, కేంద్రం నుంచి నిధులు అడిగితే కేటీఆర్‌కి ఎందుకు ఉలికి పాటు అంటూ ప్రశ్నించారు.


Similar News