సీఎం రేవంత్ రెడ్డి పచ్చి మోసగాడు: కేటీఆర్ ఫైర్
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ బుధవారం వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పచ్చి మోసగాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తెలంగాణలో మోసాల పరంపర కొనసాగుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఉండగా.. కాంగ్రెస్ పాలనలో ప్రముఖ ఎంజీఎం ఆసుపత్రిలో 5 గంటలు కరెంట్ పోయిన దిక్కే లేదని అసహనం వ్యక్తం చేశారు. అలాగే వరంగల్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన 24 ఆంతస్తుల ఆసుపత్రి పనులు కూడా నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో వరంగల్ నుండి సాఫ్ట్‌వేర్ కంపెనీలు వెళ్లిపోతున్నాయని మండిపడ్డారు.