కేటీఆర్ vs కిషన్ రెడ్డి.. BRS మంత్రి వ్యాఖ్యలకు బీజేపీ స్టేట్ చీఫ్ స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వం పంపిన ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను గవర్నర్ తిరస్కరించడంపై మంగళవారం కేటీఆర్ తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు.

Update: 2023-09-26 12:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వం పంపిన ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను గవర్నర్ తిరస్కరించడంపై మంగళవారం కేటీఆర్ తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. గవర్నర్ బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో కిషన్ రెడ్డి దేశంలోనే మోస్ట్ అన్ ఫిట్ లీడర్ అని ఆయన గురించి మాట్లాడటం వెస్ట్ అంటూ అసహనం వ్యక్తం చేశారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

మంత్రి కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారని.. తెలంగాణ కేటీఆర్ జాగీరు కాదని ధ్వజమెత్తారు. తండ్రిని అడ్డుపెట్టుకుని కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని.. అతడి సర్టిఫికెట్ తనకు అక్కర్లేదని అన్నారు. కేసీఆర్ కుటుంబానికి ఏజెంట్లుగా ఉంటూ ఆ కుటుంబానికి కొమ్ముకాసే వ్యక్తులను, పార్టీ ఫిరాయింపులకు పాల్పడేవారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా చేయాల్సిన పని లేదన్నారు. ఈ విషయంలో గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అనర్హులకు పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటని విమర్శించారు.

Tags:    

Similar News