కేసీఆర్ ను జైలుకు పంపడమే నా టార్గెట్.. కోమటిరెడ్డి హాట్ కామెంట్స్
కోమటిరెడ్డి బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ సమాధి అయిందని ఆ పార్టీలో ఎవరూ మిగలరన్నారు. హరీశ్ రావు సైతం బీజేపీలోకి వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను జైలుకు పంపడమే నా మరో లక్ష్యం అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జైలుకు వెళ్లే వ్యక్తి.. జైలుకు వెళ్లేవారిని మేం కాంగ్రెస్ లో చేర్చుకోమన్నారు. కాగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. త్వరలోనే మరికొంత మంది కారు పార్టీ దిగేందుకు రెడీ ఉన్నారనే ప్రచారం జరుగుతున్నది. మరో వైపు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సైతం ఆ పార్టీని వీడి ఇతర పార్టీలో చేరుతారనే టాక్ వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.