Kishan Reddy: ప్రెసిడెంట్ గా చెప్తున్న… బీఆర్ఎస్ తో పొత్తుపై కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్

బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

Update: 2024-10-11 09:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైడ్రా కొత్తది ఏమీ కాదని అక్రమంగా చేపట్టే నిర్మాణాలను గతంలో జీహెచ్ఎంసీ కూల్చివేసేదని ఇప్పుడు దానికి పేరు మార్చి హైడ్రా పెట్టారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. హైడ్రాపై తొందరపాటు నిర్ణయాలు తగదని దుందుడుకు నిర్ణయాలు సరికావని హెచ్చరించారు. డీపీఆర్ లేకుండా కూలగొడితే ఎలా? కూలగొట్టిన వాటికి బ్యాంక్ ఈఎంఐలు ఎవరు కట్టాలని నిలదీశారు. పేద ప్రజల ఇల్లు కూల్చమని మా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు చెప్పలేదన్నారు. హైడ్రా ఏమైనా భూతమా? అని నిలదీశారు. మూసీ పరివాహక ప్రాంతంలో 40 ఏళ్లుగా నివాసం అంటున్న వారికి ప్రభుత్వమే అన్ని వసతులు కల్పించి ఇప్పుడు కూల్చివేస్తామనడం సరికాదని మండిపడ్డారు. మూసీ పరివాహక ప్రాంతంలో ధనవంతులు ఎవరు ఉండరని అంతా పేదవారే ఉన్నారన్నారు. శుక్రవారం నాంపల్లిలోని పార్టీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ నిర్వాసితుల ఇండ్లను కులగొట్టడం అనేది అంత తేలిక కాదని దానికి పెద్ద సాహసమే చేయాల్సి వస్తదన్నారు.

నిజానికి కాంగ్రెస్ హయంలోనే మూసి పరివాహక ప్రాంతంలో ఎక్కువ శాతం నిర్మాణాలు జరిగాయన్నారు. మూసీ నిర్వాసితులతో సీఎం ప్రజాదర్బార్ పెట్టి అక్కడి ప్రజలను ఒప్పించాకే కూల్చివేత్తలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం డ్రైనేజీ వ్యవస్థ అంతా మూసీలోనే కలుస్తుందని, డ్రైనేజీకి ప్రత్యామ్నాయం లేకుండా సుందరీకరణ ఏంటని ప్రశ్నించారు. రిటైనింగ్ వాల్ కట్టి మూసీ సుందరీకరణ చేయవచ్చన్నారు. గంగా సుందరీకరణ కోసం చాలా తక్కువ ఖర్చు చేస్తున్నామని గుర్తు చేశారు. మూసీ ప్రక్షాళన కోసం లక్ష యాభై వేల కోట్లు అంటే ఎక్కడి నుంచి తెస్తారుని ప్రశ్నించారు. అసలు ఎందుకు అంత డబ్బు ఖర్చు అవసరపడుతున్నదని నిలదీశారు. డీపీఆర్ లేకుండానే కూల్చివేత్తలు చేపడితే ఎలా అని నిలదీశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ద్వంసం చేయడంపై కిషన్ రెడ్డి స్పందించారు. విగ్రహాం కూల్చడం సరికాదన్నారు. ఈ ఘటనను తాము ఖండిస్తున్నామని దీనిపై బీజేపీ పోరాటం చేస్తుందని చెప్పారు.

బీఆర్ఎస్ తో పొట్టు ప్రసక్తే లేదు:

బీఆర్ఎస్ త్వరలోనే బీజేపీతో జతకట్టబోతున్నదనే ప్రచారం జరుగుతున్న వేళ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తో కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదన్నారు. ఒక్క ప్రెసిడెంట్ గా చెప్తున్నానని బీఅర్ఎస్ తో పొత్తుకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటుందనే ప్రచారం జరుగుతున్నది. దీంతో తిరిగి స్టేట్ పాలిటిక్స్ లో స్ట్రెంత్ ఆన్ అయ్యేందుకు బీఆర్ఎస్ కమలం పార్టీతో కలిసి పని చేయబోతున్నదని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో గులాబీ పార్టీతో తమకు పొత్తుకు ఛాన్స్ లేదని స్వయంగా కిషన్ రెడ్డి ప్రకటన చేయడం ఆసక్తిగా మారింది.


Similar News