Kishan Reddy: మాటిచ్చి తప్పడం కాంగ్రెస్‌కు అలవాటే.. రేవంత్ రెడ్డి లేఖపై కిషన్ రెడ్డి కౌంటర్

ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి రాసిన లేఖపై కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-10-07 13:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తప్పుడు వాగ్దానాలు ఇవ్వడం.. ఆపై మాట తప్పడం కాంగ్రెస్ పార్టీకి పరిపాటిగా మారిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సగం మందికి మాత్రమే చేసిందని ఆరోపించారు. రుణమాఫీపై ప్రధాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ సీఎం రేవంత్ రాసిన లేఖపై కిషన్‌రెడ్డి ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల తర్వాత 26 ఆగస్టు 2024న రూ.31,000 కోట్లు మాఫీ చేసినట్లు మీరు చెబుతున్నారు.. కానీ రూ.17,000+ కోట్లు మాఫీ చేశామని నిన్న ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారని గుర్తుచేశారు. మిగిలిన రూ.14,000 కోట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ఇంకా 16 లక్షల మంది లబ్ధిదారులు మిగిలిపోయారని, మాఫీ కోసం వారు ఇంకెంత కాలం ఎదురుచూడాలని ప్రశ్నించారు.


Similar News