కేంద్రం నుంచి ‘వరద సాయం’పై కిషన్ రెడ్డి స్పష్టత

వరదలతో అతలాకుతలం అయిన రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Update: 2024-09-03 11:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరదలతో అతలాకుతలం అయిన రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్రానికి నివేదికలు రాకపోయినా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీ, తెలంగాణ వరదలపై కేంద్రానికి నివేదికలు వచ్చాయని స్పష్టం చేశారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులను ఆదుకోవాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సహాయ చర్యలు కొనసాగించేలా, వారికి అందుబాటులో ఉండాలని పార్టీ శ్రేణులను కిషన్ రెడ్డి ఆదేశించారు.

వరద బాధితులను ఆదుకునేలా, కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తున్న కార్యకర్తలను అభినందించారు. వారి సేవలు కొనసాగించాలని సూచించారు. గత మూడు రోజులుగా కురిసిన వర్షాలు, వరదల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు పలువురు మృతిచెందడం, ప్రజల ఆస్తులు ధ్వంసం కావడం, పెద్దఎత్తున రైతుల పంటపొలాలు దెబ్బతినడంపై విచారం వ్యక్తం చేశారు.


Similar News