అదే ఊపుతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలి.. ఎంపీలు, ఎమ్మెల్యేలకు కిషన్‌రెడ్డి దిశానిర్దేశం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం వేళ తెలంగాణ బీజేపీ నేతలు కీలక సమావేశం నిర్వహించారు.

Update: 2025-02-08 07:14 GMT
అదే ఊపుతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలి.. ఎంపీలు, ఎమ్మెల్యేలకు కిషన్‌రెడ్డి దిశానిర్దేశం
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: (Delhi Assembly Elections)ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం వేళ (Telangana BJP) తెలంగాణ బీజేపీ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశంలో కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) ఢిల్లీ ఎన్నికల ఫలితాల ప్రస్తావన తీసుకొచ్చారు. ఢిల్లీ గెలుపుతో తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవాలని కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ అంటేనే ఓ నమ్మకం.. నిజాయితీ పాలన బీజేపీతోనే సాధ్యమని ఢిల్లీ ప్రజలు విశ్వసించారని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. ఢిల్లీలో విజయం సాధిస్తున్నామని.. అదేఊపుతో (MLC elections) ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay), ఎంపీలు కె లక్ష్మణ్ (MP K Laxman), డీకే అరుణ (DK Aruna), రఘునందన్ రావు (Raghunandan Rao), బీజేపీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

కాగా, దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ హోరా హోరీగా జరుగుతోంది. చాలా ఏళ్ల తర్వాత బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో గెలుపు దిశగా అడుగులు వేస్తోంది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలందరూ వెనుకంజలో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్, సీఎం అతిశీ, మనీశ్ సిసోడియా తదితరులపై ప్రత్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Tags:    

Similar News