రేవంతే మొదటి ముద్దాయి.. ఊచలు లెక్కపెట్టాల్సిందే: కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్

మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పినట్లు కొన్ని ఫేక్

Update: 2024-05-01 12:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పినట్లు కొన్ని ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎన్నికల వేళ ఈ వీడియోలు వివాదస్పదంగా మారడంతో ఈ ఫేక్ వీడియోలపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు చేసిన పోలీసులు కొందరు నిందితులను సైతం అరెస్ట్ చేశారు. అమిత్ షా ఫేక్ వీడియోల వ్యవహారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సైతం ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమిత్ షా ఫేక్ వీడియో ఇష్యూపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిజర్వేషన్ల రద్దుపై కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అమిత్ షా వీడియో మార్ఫింగ్ చేయించి టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డే వాళ్ల పార్టీ అఫిషియల్ అకౌంట్‌లో పెట్టించారని ఆరోపించారు. దీనికి పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదేనన్నారు. ఈ వీడియో అంశంలో మొదటి ముద్దాయి రేవంత్ రెడ్డే అని.. ఫేక్ వీడియోలో ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈ కేసులోని నిందితును ఊచలు లెక్కపెట్టేలా చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.


Similar News