Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏ ఒక్కటే.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
మూసీ (Musi) ప్రక్షళన చేయండి.. పేదల ఇళ్లను కూల్చకండి అనే డిమాండ్‌తో బీజేపీ (BJP) నేతలు మూసీ పరీవాహక ప్రాంతాల్లో (Musi Catchment Area) బస్తీ నిద్ర చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: మూసీ (Musi) ప్రక్షళన చేయండి.. పేదల ఇళ్లను కూల్చకండి అనే డిమాండ్‌తో బీజేపీ (BJP) నేతలు మూసీ పరీవాహక ప్రాంతాల్లో (Musi Catchment Area) బస్తీ నిద్ర చేశారు. అదేవిధంగా మూసీ బస్తీల్లో ఒకరోజు నిద్రించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన సవాలును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) స్వీకరించారు. ఈ మేరకు ఆయన రాత్రి అంబర్‌పేట నియోజకవర్గ (Amberpet Constituency) పరిధిలోని తలసీరామ్ నగర్ (Tulasiram Nagar)లోని ఓ ఇంట్లో భోజనం చేసి అక్కడే ఆయన నిద్రించారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుపేదల ఇళ్లను కూల్చకుండా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ (Muse Renaissance Project) పనులను చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డీపీఆర్ (DPR), నిధులు లేకుండా మూసీ పునరుజ్జీవం Muse Renaissance) ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పేదవాళ్ల మీద నుంచి బుల్డోజర్లు ఎక్కిస్తారా.. వేల ఇళ్లు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలను కూల్చుతారా అని ప్రశ్నించారు. పదేళ్ల తరువాత నల్లగొండ (Nalgonda) ప్రజలకు నీళ్లు ఇవ్వడం కాదని.. వెంటనే ఇవ్వాలని అన్నారు. అందుకు ఏకైక పరిష్కారం రీటైనింగ్ వాల్ (Retaining Wall) కట్టడమేనని తెలిపారు. బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) ఒక్కటై మూసీ ప్రక్షళనను అడ్డుకుంటున్నాయంటూ అధికార కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తాము ఇప్పటి వరకు బీఆర్ఎస్ (BRS) పార్టీతో పొత్తు పెట్టుకోలేదని తెలిపారు. ఇక ముందు కూడా అది జరగబోదని క్లారిటీ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాయని గుర్తు చేశారు. తన డీఎన్ఏ (DNA) ఏమిటో ప్రజలకు తెలుసని.. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) డీఎన్ఏ ఒక్కటేనని కిషన్ రెడ్డి కామెంట్ చేశారు.