Yellandu MLA : రైతుల అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట
కామేపల్లి రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం
దిశ,ఇల్లందు : కామేపల్లి రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు పెద్దపీట వేస్తుందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. మంగళవారం కామేపల్లి డీసీసీబీ బ్రాంచ్ లో రైతు రుణమాఫీ వర్తించిన రైతులకు మంజూరైన రుణాలు చెక్కులను అందజేసి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటుందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలనిదే ముఖ్య లక్షమని అందులో భాగంగా త్వరలో ధరణిలో మార్పులు చేర్పులు చేసి అర్హులైన ప్రతి ఒక్క రైతుకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్, పిఎసిఎస్ చైర్మన్ ధనియాకుల హనుమంతరావు నాయకులు గింజల నరసింహారెడ్డి, గుజ్జర్ల పూడి రాంబాబు, నల్లమోతు లక్ష్మయ్య, రామ్ రెడ్డి జగన్నాథ్ రెడ్డి, డిసిసి బ్యాంక్ సీఈవో అబీద్ ఉర్ రహమాన్, కామేపల్లి బ్రాంచ్ మేనేజర్ రామస్వామి, రైతులు పాల్గొన్నారు.