దుకాణ యజమానులకు న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే వెంకట్రావు
రామాలయం అభివృద్ధిలో భాగంగా నష్టపోతున్న దుకాణ యజమానులను

దిశ,భద్రాచలం : రామాలయం అభివృద్ధిలో భాగంగా నష్టపోతున్న దుకాణ యజమానులను అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు హామీ ఇచ్చారు. శనివారం దుకాణ సముదాయాలను ఆయన ఆర్ డి ఓ దామోదర్ తో కలిసి పరిశీలించారు. దుకాణ యజమానులకు తగిన న్యాయం చేసిన తర్వాతే తొలగించడం జరుగుతుందని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఎమ్మెల్యే వెంట బుడగం శ్రీనివాస్, తాళ్లపల్లి రమేష్ గౌడ్, బోగాల శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సరెళ్ల నరేష్ తదితరులు ఉన్నారు.