వీకేఓసీలో ఉత్పత్తిని త్వరితగతిన ప్రారంభించాలి..

కొత్తగూడెం ఏరియాలో నూతనంగా అనుమతులు వచ్చిన వీకే ఓసీ ప్రాజెక్ట్ స్థితిగతులు గురించి సంబంధిత అధికారులతో మంగళవారం సింగరేణి సంస్థ సీ అండ్ ఎండీ ఎన్.బలరాం జీకే ఓసీలో సమీక్ష నిర్వహించారు.

Update: 2025-04-01 15:37 GMT

దిశ, కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియాలో నూతనంగా అనుమతులు వచ్చిన వీకే ఓసీ ప్రాజెక్ట్ స్థితిగతులు గురించి సంబంధిత అధికారులతో మంగళవారం సింగరేణి సంస్థ సీ అండ్ ఎండీ ఎన్.బలరాం జీకే ఓసీలో సమీక్ష నిర్వహించారు. త్వరితగతిన వీకేఓసీలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జీఎం శాలెం రాజు మాట్లాడుతూ చైర్మన్ బలరాం ప్రోద్బలం, సహకారంతో అనుమతులు మంజూరు కావడం అయిందని తెలియజేశారు.

అనంతరం గత ఆర్థిక సంవత్సరం 2024-25 నకు కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 143 లక్షల టన్నులు (వీకేఓసీకు నిర్దేశించిన లక్ష్యాన్ని మినహాయింపు చేసి) గాను 144.18 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని 100.5 తో సాధించారు. ఈ ఉత్పత్తి సాధనలో ప్రధాన పాత్ర పోషించిన జేవీఆర్ ఓసీ ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 112 లక్షల టన్నులకు గాను 114.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని నేటి వరకు రక్షణతో సాధించి సింగరేణి సంస్థ కు పెద్దన్న పాత్ర పోషిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇలాగే రానున్న ఆర్థిక సంవత్సరాలలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ సింగరేణి అభివృద్ధిలో ముందు వరుసలో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.

సింగరేణి సంస్థ సీఎండీ బలరాం మాట్లాడుతూ ఈ అధిక ఉత్పత్తి సాధించడంలో భాగస్వాములైనటువంటి సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీ ఉద్యోగులను, అధికారులను, ఉత్పత్తి అయిన బొగ్గును రవాణా చేసిన జేవీఆర్ సీహెచ్పీ సిబ్బందిని, యూనియన్ ప్రతినిధులను ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధనలో ముందుండి నడిపించిన ఏరియా జీఎం ఎం.షాలేం రాజు కి ఏరియా ఉద్యోగులకు, అధికారులకు యూనియన్ ప్రతినిధులకు అలాగే ప్రతి విషయాన్ని ప్రజలందరికీ చేరవేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగూడెం ఏరియా బొగ్గు ఉత్పత్తిలో నెలకొల్పిన రికార్డులను చైర్మన్ ప్రస్తావించారు. కొత్తగూడెం ఏరియా నందు బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైనప్పటి నుండి ఈ ఆర్థిక సంవత్సరంలోనే 114.18 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసిందన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ తమ కేటాయించిన విధులను తప్పనిసరిగా ఎనిమిది గంటల సమయంలో నిర్వర్తించాలని, భారీ యంత్రాల వినియోగ సమయాన్ని పెంచాలని సూచించారు.

సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తప్పనిసరిగా విధులకు హాజరవుతూ నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని, అదేవిధంగా గనులలో వివిధ కేటగిరీలలో పనిచేస్తున్న ఉద్యోగులతో చైర్మన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం షాలేం రాజు, జీఎం (సివిల్) టి. సూర్యనారాయణ, జిఎం (సేఫ్టీ) చింతల శ్రీనివాస్, జిఎం (పీపీ) సాయిబాబా, జిఎం (ఎన్విరాన్మెంట్) సైదులు, జిఎం (ఎస్టేట్స్) రాధాకృష్ణ, జిఎం (సిహెచ్ పి) తిరుమల రావు, ఇంచార్జ్ సర్వే రాఘవేందర్ రావు కొత్తగూడెం ఏరియా ఎస్ఓటు జిఎం జీవీ.కోటి రెడ్డి, ఏరియా ఇంజనీర్ కే. సూర్యనారాయణ రాజు, డిజిఎం (పర్సనల్) బి శివకేశవరావు, ఎజిఎం (సివిల్) సిహెచ్ రామకృష్ణ, డిజిఎం (ఐఈడి) ఎన్.యోహన్, ప్రాజెక్ట్ ఆఫీసర్ జికే ఓసి ఎం.రమేష్, గుర్తింపు ప్రాతినిధ్య సంఘం సభ్యులు, కొత్తగూడెం ఏరియాలోని వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Similar News