పంచాయతీ భవన నిర్మాణాన్ని అడ్డుకున్న గ్రామస్తులు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాచారం గ్రామంలో

Update: 2024-08-15 08:56 GMT

దిశ,దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాచారం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.24 లక్షలతో జరుగుతున్న గ్రామపంచాయతీ కార్యాలయం నిర్మాణ పనులను గురువారం నాచారం గ్రామస్తుల అడ్డుకున్నారు. నాచారం గ్రామ పంచాయతీ కార్యాలయం స్లాబ్ కోసం వాడే కాంక్రీట్ మెటీరియల్ ఇసుక, కంకర నాసిరకంగా ఉన్నాయని, ఇసుక,కంకరలో పూర్తిగా మట్టితో కలిసిపోయిందని, వాటితోనే స్లాబ్ నిర్మాణం చేపట్టేందుకు సిద్ధంగా ఉంచిన నాసిరకం ఇసుక కంకర ను గమనించిన గ్రామస్తులు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీల సహాయంతో నిర్మాణ పనులను నిలిపివేశారు.

వెంటనే సంబంధిత శాఖ అధికారులకు దీనిపై ఫిర్యాదు చేశారు.కాంట్రాక్టర్ ఇష్ట రాజ్యం కారణంగానే నాణ్యత తిలోదకాలుగా ఉందని, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు ఇదే విషయంపై పంచాయతీరాజ్ డీఈఈ శ్రీధర్ ను దిశ వివరణ కోరగా గ్రామస్తులు నుంచి ఫిర్యాదు అందిన వెంటనే పనులు ఆపివేయాలని కాంట్రాక్టర్ కు హెచ్చరించానని, పంచాయతీ భవనం స్లాబ్ కు కొంచెం కూడా అక్కడున్న కంకర, ఇసుకను వాడలేదని, నాణ్యతతో కూడిన మెటీరియల్ వచ్చిన తర్వాతనే పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.


Similar News