కరకగూడెం అడవిలో పులి సంచారం.. భయాందోళనలో గిరిజనులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని రఘునాథపాలెం అడవుల్లో పులి (Tiger) సంచారంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.

Update: 2024-12-15 06:04 GMT

దిశ, మణుగూరు, కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని రఘునాథపాలెం అడవుల్లో పులి (Tiger) సంచారంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. పుచి సంచారంతో పొలాలకు వెళ్లేందుకు రైతులు, గిరిజనులు భయపడుతున్నారు. పులి పెద్ద పెద్ద అరుపులు అరుస్తుందని, అది అడవిలో ఉందని, అటువైపు వెళ్లాలంటేనే అన్నదాతలు, గిరిజనులు జంకుతున్నారు. పెద్దపులి సంచారంతో పశువులు సైతం దొడ్ల కే పరిమితం అవుతున్నాయని సమాచారం. ఈ సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. పులి జాడ కోసం ముమ్మరంగా కరకగూడెం అడవుల్లో గాలిస్తున్నారు. పెద్ద పులిని గుర్తించక పోయినా పులి పాదముద్రలు మాత్రమే అధికారులు గుర్తించినట్లు తెలుస్తొంది. ఏది ఏమైనా అధికారులు అడవుల్లోనే ఉండి పులి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేస్తున్నారు.


Similar News