ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

ప్రభుత్వ ఉద్యోగులకు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ అధికారుల ఉపాధ్యాయుల కార్మిక పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ రామారావు, కన్వీనర్ వెంకట పుల్లయ్య కోరారు.

Update: 2024-12-12 11:59 GMT

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : ప్రభుత్వ ఉద్యోగులకు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ అధికారుల ఉపాధ్యాయుల కార్మిక పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ రామారావు, కన్వీనర్ వెంకట పుల్లయ్య కోరారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ ను అమలు చేయాలన్నారు. కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ రద్దుచేసి సీపీఎస్ అండ్ యూపీఎస్ పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని కోరారు. పదవీ విరమణ అనంతరం సర్వీస్ పొడిగింపుకాని రీ ఎంప్లాయిమెంట్ ను చేయవద్దని తెలిపారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు.

    నర్సింగ్ డైరెక్ట రేట్ ను మంజూరు చేయాలన్నారు. నూతన గ్రామ రెవెన్యూ వ్యవస్థలో రద్దయిన వీఆర్వోలను వారి ఎంపికల ప్రకారం రెవెన్యూ శాఖకు తీసుకువచ్చి, మునుపటి సీనియార్టీ ప్రకారం వారి సేవలను రెవెన్యూ శాఖలో క్రమబద్ధకరించాలన్నారు. రాష్ట్రంలో 2.9 లక్షల మంది పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక పెన్షనర్స్ డైరెక్టరేట్​ ఏర్పాటు చేయాలని కోరారు. ఇంక్రిమెంట్ ఇన్సెంటివ్ మంజూరు చేయాలన్నారు. పెన్షనర్ అసోసియేషన్ భవనాలకు స్థలాలు కేటాయించాలన్నారు. మరణించిన వీఆర్ఏ కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు.

    విలేకరుల సమావేశంలో టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి కంచర్ల సాయి భార్గవ్ చైతన్య, టీజీఓ జిల్లా కార్యదర్శి మహేష్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, టీఆర్ఈఎస్ ఏ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, పీఆర్టీయూ జిల్లా బాధ్యులు జహంగీర్ షరీఫ్, ఎస్టీయూ బాధ్యులు మంగీలాల్, జీటీఏ బాధ్యులు లాల్సింగ్, నాల్గొవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పాషా, డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షులు వనమా శ్రీనివాస్, ఎంపీఓల సంఘం బాధ్యులు శ్రీనివాస్, మున్సిపల్ సంఘం బాధ్యులు అశోక్ చౌహన్, సీపీఎస్ యూనియన్ సంఘం బాధ్యులు తుక్కాని శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శుల సంఘం బాధ్యులు వంశీకృష్ణ, జూనియర్ అధ్యాపాకుల సంఘం బాధ్యులు బండి వెంకటేశ్వర్లు, పంచాయతీ రాజ్ యూనియన్ బాధ్యులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Similar News