కాలం చెల్లిన సిరప్ ను ఇచ్చిన వైద్య సిబ్బంది.. బాలిక సీరియస్

Update: 2024-08-29 03:05 GMT

దిశ, జూలూరుపాడు : ఆసుపత్రికి చికిత్సలు పొందేందుకు వచ్చిన ఒక బాలికకు ఎక్స్ పైర్ అయిపోయిన టానిక్ ఇవ్వటంతో వైద్య సిబ్బందిపై ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన బుధవారం జూలూరుపాడులో చోటు చేసుకుంది. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జూలూరుపాడు న్యూ కాలనీకి చెందిన వేమూరి ప్రీతికి కళ్ళు తిరగడంతో మంగళవారం ఆమె నాయనమ్మ స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళింది. దీంతో పరీక్షించిన వైద్యడు ముందు పిల్లలతో పాటు పోరిక్ యాసిడ్ టానిక్కును రాశారు. ఫార్మాసిస్టు వాటిని పంపిణీ చేసింది. బాలిక తండ్రి అనిల్ టానిక్కును పరిశీలించగా కాలం చెల్లిందని గుర్తించాడు. ఇదే విషయమై కుటుంబ సభ్యులు బంధువుల కలిసి, ఆసుపత్రికి వెళ్లి సిబ్బందిని నిలదీశారు. ఇలాంటి సంఘటన మరోసారి జరగకుండా చూసుకుంటామని వైద్యాధికారి చెప్పినట్లు బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయమై వైద్యాధికారి వెంకటేశ్వర్లను వివరణ కోరగా ఆసుపత్రిలో అలాంటి సిరప్ లు చాలా ఉన్నాయని వాటిని పరిశీలించగా 2026 వరకు డేట్ ఉందని, ఇది ఎలా వచ్చిందో విచారణ చేపడుతామని తెలిపారు.


Similar News