ఏటూరు నాగారం ఎన్కౌంటర్ బూటకపు హత్యలే.. సీపీఐఎంఎల్

సీపీఐ(మావోయిస్టు) నాయకులు బద్రుతో సహా ఏడుగురిని విషప్రయోగం తోటి పట్టుకుని వీరిని ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని సీపీఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అవునూరి మధు ఆరోపించారు.

Update: 2024-12-02 07:18 GMT

దిశ, ఖమ్మం టౌన్ : సీపీఐ(మావోయిస్టు) నాయకులు బద్రుతో సహా ఏడుగురిని విషప్రయోగం తోటి పట్టుకుని వీరిని ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని సీపీఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అవునూరి మధు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పట్టుకొని కాల్చి దీన్ని ఎన్కౌంటర్ గా చిత్రీకరిస్తున్నారన్నారు. ఈ హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, దీని పై సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని, నిపుణులైన ప్రత్యేక వైద్యుల చేత మృతుల కుటుంబాల సమక్షంలో సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్కౌంటర్ కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను, ఏడో గ్యారంటీ ఇస్తున్నానని ప్రకటించాడు. ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో తొక్కి బూటకపు ఎన్కౌంటర్ లను రాష్ట్రంలో కొనసాగిస్తున్నాడన్నారు. మోడీ ఆదేశాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నాడు. గత బీఆర్ఎస్ మతోన్మాద బీజేపీ ప్రభుత్వాల వైఖరికి భిన్నంగా రేవంత్ రెడ్డి పరిపాలన లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రజా వ్యతిరేక వైఖరిని కొనసాగిస్తే గత ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుందన్నారు.


Similar News