disha effect : ప్రారంభమైన ఆక్సిజన్ జనరేటర్
మూలనపడ్డ ఆక్సిజన్ జనరేటర్ తిరిగి వినియోగంలోకి వచ్చింది. సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో కరోనా సమయంలో ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ జనరేటర్ మూలన పడింది.
దిశ, కొత్తగూడెం : మూలనపడ్డ ఆక్సిజన్ జనరేటర్ తిరిగి వినియోగంలోకి వచ్చింది. సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో కరోనా సమయంలో ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ జనరేటర్ మూలన పడింది. ఈనెల 9వ తేదీన దిశ దిన పత్రికలో మూతపడ్డ ఆక్సిజన్ జనరేటర్లు అనే కథనం ప్రచురితమైంది. స్పందించిన సింగరేణి ఉన్నతాధికారులు ఆక్సిజన్ జనరేటర్ బాగు చేసే నిపుణులను పిలిపించి మరమ్మతులు చేయించి తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చారు. దీంతో మంగళవారం సాయంత్రం నుండి ఆక్సిజన్ జనరేటర్ వినియోగంలోకి వచ్చింది. సింగరేణి ప్రధానాస్పత్రికి కావలసిన ఆక్సిజన్ ను ఆక్సిజన్ జనరేటర్ ద్వారానే సరఫరా చేస్తున్నారు. ఈ అంశం పై సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.