నగరంలో అక్రమ కట్టడాల వెనక ఆయన హస్తం
ఖమ్మం నగరంలో అక్రమ కట్టడాలపై గత మూడు రోజులుగా వస్తున్న కథనాలతో... Special Story on illegal Constructions
దిశ, ఖమ్మం సిటీ: ఖమ్మం నగరంలో అక్రమ కట్టడాలపై గత మూడు రోజులుగా వస్తున్న కథనాలతో అక్రమార్కుల డొంక మొత్తం కదులుతున్నది. పట్టణ ప్రణాళికా విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఓ ముఖ్య అధికారి అండతో నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నట్లు పెద్దఎత్తునా ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరపాలక సంస్థ పరిధిలో నిర్మించే భవనాలు ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఎవరు పాటించకపోయినా పట్టణ ప్రణాళిక అధికారి వారిపై చర్యలు తీసుకోవాలి. ఇన్ని తెలిసిన ఆ అధికారే కాసులకు కక్కుర్తి పడి అక్రమార్కులకు అండగా నిలుస్తూ నిబంధనలను పాటించాల్సిన అవసరం లేదంటూ వారికి అభయం ఇచ్చాడు. పైగా పత్రికల్లో వార్తలు రావడం సహజమని, నాలుగు రోజులు వస్తూ ఉంటాయని అవేమి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అంతా తాను చూసుకుంటాను అంటూ వారికి హామీ ఇచ్చినట్లు గుసగుసలు వినపడుతున్నాయి.
ఓ ప్రభుత్వ ఉద్యోగంలో విరమణ పొందిన ఆయన కనీసం తాకట్టు పెట్టుకున్న పట్టా భూములు ఎంత కాలానికి నిర్మాణం చేపట్టాలో చేపట్టకూడదో తెలీదా అంటూ అక్కడి స్థానికులు విమర్శిస్తున్నారు. అసలు క్షుణ్నంగా పరిశీలిస్తే ఆ ఇంటి నిర్మాణం చేపడుతున్న స్థలం వాస్తవానికి ఎవరిది.. ఇతనికి ఆ స్థలం ఏవిధంగా వచ్చిందో తెలుసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా అవేమి పట్టించుకోకుండా వారికి ఉచిత సలహాలు ఇస్తూ ప్రభుత్వా ఆదాయానికి గండి కొట్టే పనిలో పడ్డారు. వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 100 గజాలలోపు స్థలాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేకపోయినా ప్రభుత్వం పట్టా ద్వారా ఇచ్చే స్థలం ఎవరిదైతే వారే అక్కడ ఇంటి నిర్మాణం చేపట్టాలి. కానీ తాకట్టు పెట్టుకున్న స్థలం తనదేనంటూ దర్జాగా ఇంటి నిర్మాణం చేపడుతుంటే బాధితులు ఏం చేయాలో తెలియక ఆ స్థలంపై ఆశలు వదులుకున్నారు. ఇది ఆసరాగా చేసుకున్న మాజీ ప్రభుత్వ ఉద్యోగి ఇంటి నిర్మాణం చేపట్టడం కోసం వెనుకాడలేదు. ఇది మచ్చుకు మాత్రమే ప్రస్తుతం పట్టణ ప్రణాళిక విభాగంలో జరిగిన సంఘటన.
ఇంకా మరెన్నో నగరంలో అక్రమ కట్టడాలు అనుమతి ఒకటి తీసుకుంటూ మరొకటి నిర్మించుకుంటూ ఉన్నా సదరు అధికారి ఏమి చర్యలు తీసుకోకపోవడం వెనక గల కారణాలు ఇవ్వని తెలుస్తున్నాయి. బీఆర్ఎస్ భవనం ఏవిధంగా నిర్మిస్తున్న ఇంటికి సైతం సిల్ట్‌తో సహా నాలుగు అంతస్తులకు మాత్రమే అనుమతి ఉండగా అదనంగా మరో అంతస్తు పైకి లేపడం గల కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. ఎన్‌ఎస్‌టీ రోడ్‌లో జరుగుతున్న ఇంటి నిర్మాణం కూడా ఇదే కోవలోకి వస్తుందని అనుమానాలు లేకపోలేదు.