షాపులు బంద్ చేయిస్తే కాంగ్రెస్ గెలుపు ఆగుతుందా.. మాజీ మంత్రి తుమ్మల

గాంధీ నడయాడిన ప్రాంతంలో అప్రజాస్వామికంగా బెదిరించి షాప్ లు బంద్ చేయాలని బెదిరిస్తే కాంగ్రెస్ గెలుపు ఆగుతుందా అంటూ మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-11-09 08:34 GMT

దిశ, ఖమ్మం : గాంధీ నడయాడిన ప్రాంతంలో అప్రజాస్వామికంగా బెదిరించి షాప్ లు బంద్ చేయాలని బెదిరిస్తే కాంగ్రెస్ గెలుపు ఆగుతుందా అంటూ మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం గాంధీ చౌక్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు షాప్ లు మూసేస్తే బాక్స్ లు మూసుకోవు.. మీ బటన్ లు ఆగవు.. చేతి గుర్తు పై మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా నొక్కుతారని హెచ్చరించారు. స్వాతంత్ర పోరాటంలో ఖమ్మం గాందీ చౌక్ ప్రాంతంలో గాంధీ అహింసా పోరాటం గూర్చి చైతన్యం చేశారని, గాంధీ నడయాడిన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ వస్తుందని అధికార పార్టీ నేతలు అప్రజాస్వామికంగా వ్యాపారాలు బంద్ చేయమని బెదిరించారని అన్నారు.

నలబై ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇంత అరాచక అవినీతి పాలన చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా సంపాదించిన మట్టి డబ్బులు.. ఇసుక డబ్బులు ఆఖరికి బ్రాందీ షాప్ ల దగ్గర వసూళ్లు చేసిన సంస్కృతి ఈ దరిద్రపు నాయకులది అని ఎద్దేవా చేశారు. తాను ఏనాడూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో.. వ్యాపారంలో వేలు పెట్టలేదని గుర్తు చేశారు. తలుపులు మూసుకొని ఎన్నాళ్ళు బతుకుతారు. భయపెట్టి గెలవాలని మథం పట్టిన నేతలను తరమి కొట్టాలని పిలుపునిచ్చారు. ‌తుమ్మల ఫలానా వారిని బెదిరించారని నిరూపిస్తే మహాత్మా గాంధీ సాక్షిగా రాజకీయాల నుంచి వైదొలుగుతని సవాల్ చేశారు.

Tags:    

Similar News