ఆర్టీసీ అద్దె బస్సుల ఓనర్లు, డ్రైవర్ల మెరుపు సమ్మె
సత్తుపల్లి ఆర్టీసీ డిపో పరిధిలోని సుమారు 80 ఆర్టీసీ అద్దె బస్సులు నడుపుతున్నారు. ఆర్టీసీ కిందిస్థాయి ఉద్యోగుల వేధింపులతోపాటు, స్టేజీలు పెంచి టైం కుదించటం,బస్సులో ఓనర్లు, డ్రైవర్లు సమస్యలపై ఉన్నతాధికారుల
దిశ సత్తుపల్లి : సత్తుపల్లి ఆర్టీసీ డిపో పరిధిలోని సుమారు 80 ఆర్టీసీ అద్దె బస్సులు నడుపుతున్నారు. కాగా, ఆర్టీసీ కిందిస్థాయి ఉద్యోగుల వేధింపులతోపాటు, స్టేజీలు పెంచి టైం కుదించటం,బస్సులో ఓనర్లు, డ్రైవర్లు సమస్యలపై ఉన్నతాధికారుల వేధింపులపై శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఆర్టీసీ మెరుపు సమ్మె నిర్వహించారు.
అనంతరం సత్తుపల్లి డిపో మేనేజర్ యు రాజలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకొని ఓనర్లు, డ్రైవర్ల పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆమెకు అందజేశారు. దీనిపై స్పందించిన డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి పలు సమస్యలపై ఉన్నతాధికారులకు నివేదించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పడంతో అద్దె బస్సుల ఓనర్లు, డ్రైవర్ల సమ్మెను విరమించి 10 గంటల నుంచి బస్సులు యదావిధిగా నడుపుతున్నారు. తమ సమస్యలు పరిష్కారం చూపకపోతే ఎలాంటి సమాచారం లేకుండా బస్సులు నిలుపుతామని ఓనర్లు ,డ్రైవర్లు హెచ్చరిస్తున్నారు.