MLA Venkatarao : రోటరీ సేవలు అమోఘం..

రోటరీ క్లబ్ సేవలను భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కొనియాడారు.

Update: 2024-08-10 12:12 GMT

దిశ, భద్రాచలం : రోటరీ క్లబ్ సేవలను భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కొనియాడారు. రోటరీ క్లబ్ అఫ్ రివర్ సైడ్ భద్రాచలం నూతన కమిటీ శనివారం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, అత్యవసర సమయంలోనే కాకుండా, రోటరీ క్లబ్ ఏజెన్సీ ప్రాంతాల్లో సేవలు నిర్వహించడం గర్హనీయం అని అన్నారు.

అనంతరం అధ్యక్షులుగా డాక్టర్ రమేష్ బాబు, కార్యదర్శిగా గంజి సంపత్, కోశాధికారిగా ధనుకొండ రాఘవయ్యలచే గవర్నర్ డాక్టర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేపించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ భూషణ రావు, పాస్ట్ ప్రెసిడెంట్ నాగార్జున రెడ్డి బూసిరెడ్డి, డాక్టర్ దేవరాజ్, డాక్టర్ విజయరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News