జిల్లాస్థాయి క్రీడలకు న్యూ లిటిల్ ఫ్లవర్ విద్యార్థులు ఎంపిక
ఇటీవల జరిగిన మండలస్థాయి, జోనల్ స్థాయి క్రీడల్లో న్యూ లిటిల్ ఫ్లవర్ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచి జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికయ్యారు.
దిశ, వైరా : ఇటీవల జరిగిన మండలస్థాయి, జోనల్ స్థాయి క్రీడల్లో న్యూ లిటిల్ ఫ్లవర్ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచి జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు మండల స్థాయిలో ఖో-ఖో సీనియర్ బాలుర విభాగంలో మొదటి స్థానం, జూనియర్ బాలుర విభాగంలో ద్వితీయ స్థానం సాధించారు. జోనల్ స్థాయిలో కూడా ఖో-ఖో జూనియర్స్ బాలుర విభాగంలో మొదటి స్థానం, సీనియర్ బాలుర విభాగంలో ద్వితీయ స్థానం సాధించి జిల్లా జట్టుకు ఎంపికయ్యారు.
ఖో-ఖో అండర్ 14 బాలురు విభాగంలో సేతు వెంకట హర్షిత్, భూక్యా లోకేష్, వేమిరెడ్డి సృజన, ఖో-ఖో అండర్ 17 బాలుర విభాగంలో నంద్యాల ఉదయ్ రామ్ చరణ్, భూక్యా రేవంత్, తెల్లబోయిన యశ్వంత్ జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ పోతినేని భూమేశ్వరరావు, డైరెక్టర్ కుర్రా సుమన్ మాట్లాడుతూ క్రీడలు శారీరక ఎదుగుదలకు, మానసిక వికాసానికి ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. అద్భుత ప్రతిభ కనపరిచి జిల్లా స్థాయి జట్టుకు ఎంపికైన విద్యార్థులను వారు అభినందించారు. రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక కావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ షాజీమాథ్యూ, ఏఓ ఎస్.నరసింహారావు, పీఈటీ లు, విద్యార్థులు పాల్గొన్నారు.