MP Raghuram Reddy : వాహనాల రాకపోకలకు అంతరాయం జరగకుండా చూడాలి

ఇటీవల వరదలతో దెబ్బతిన్న నగరంలోని బైపాస్ రోడ్డు బ్రిడ్జి

Update: 2024-09-02 09:12 GMT

దిశ,ఖమ్మం: ఇటీవల వరదలతో దెబ్బతిన్న నగరంలోని బైపాస్ రోడ్డు బ్రిడ్జి మరమ్మతు పనులను ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి సోమవారం పరిశీలించారు. ఖమ్మం రూరల్ మండలంలోని నాయుడుపేట, జలగం నగర్, పెద్ద తండా, రాజీవ్ గృహకల్ప, కరుణగిరి, తీర్ధాల తదితర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. ప్రజలకు బాసటగా నిలిచి వస్తుండగా బ్రిడ్జిపై ఆగారు.

ఇక్కడ మరమ్మతులు జరుగుతుండడాన్ని చూసి, తన వాహనం ఆపి అక్కడికి వెళ్లి పరిశీలించారు. నాణ్యతగా పనులు జరగాలని, వాహనాల రాకపోకలకు అంతరాయం జరగకుండా చూడాలని సూచించారు. సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రామ సహాయo రఘురాం రెడ్డి వెంట కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, చావా శివ రామకృష్ణ తదితరులు ఉన్నారు.


Similar News