బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సండ్ర
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి పురస్కరించుకొని సత్తుపల్లిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పూలమాలవేసి నివాళులర్పించారు.
దిశ సత్తుపల్లి : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి పురస్కరించుకొని సత్తుపల్లిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పూలమాలవేసి నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, వారిని స్మరించుకొని వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమానికి ఎన్నో పథకాలను తీసుకువచ్చి దళితుల సాధికారతకు పాటుపడిందని, దళిత బంధుతో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిందని అన్నారు.
సత్తుపల్లిలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తునన్నారు. భారతదేశంలో అత్యంత ఎత్తైన 125 అడుగుల డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అవకాశం కలగటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఎలా అందాలో గొప్ప నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. వారి కీర్తికి గుర్తింపుగా హైదరాబాద్ లో 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించి గౌరవిస్తుందన్నారు. అంబేద్కర్ ఒక జాతికి చెందిన వ్యక్తి కాదని అన్ని వర్గాల ఆరాధ్య దైవమన్నరు. దురదృష్టవశాత్తు బీఆర్ అంబేద్కర్ ని ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి చెందిన వాడిగా కొన్ని శక్తులు ప్రచారం చేసే విధంగా పనిచేస్తున్నాయని అన్నారు. వారు రూపొందించిన రాజ్యాంగం ద్వారానే రిజర్వేషన్లు పొందుతున్నామని అన్నారు. వారి చూపిన స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె సుజాత మున్సిపల్ చైర్మన్ కూసం పూడి మహేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఎంపీపీ దొడ్డ హైమావతి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తోట సుజలా రాణి , అంబేద్కర్ కమిటీ సభ్యులు, వేముల రత్నాకర్, నల్లటి నరసయ్య,బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు, మోనార్క్ రఫీ, మల్లూరు అంకం రాజు, వార్డ్ కౌన్సిలర్లు అనిల్, చాంద్ బాషా, తడికమల్ల ప్రకాశరావు, పలువురు బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ యువజన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read more: