MLA Payam Venkateswarlu : గత పాలకుల వల్లే నియోజకవర్గ అభివృద్ధికి నోచుకోలేదు
గత పాలకుల వల్లే నియోజకవర్గం కుంటుపడిందని,ఏ మండలం
దిశ,మణుగూరు : గత పాలకుల వల్లే నియోజకవర్గం కుంటుపడిందని,ఏ మండలం కూడా సరైన అభివృద్ధికి నోచుకోలేదని ప్రజలు పలు సమస్యలతో విలవిలలాడుతున్నారని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు.గత పాలకులు అభివృద్ధి పేరుతో అందినకాడికి దోచుకు తిని నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశారని గత పాలకులపై ఘాటుగా విమర్శలు కురిపించారు.మంగళవారం మండలంలోని మున్సిపాలిటీ వార్డులు,గ్రామ పంచాయితీలలో విస్తృతంగా పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ప్రభుత్వ భవనాల పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ గత పాలకులు అభివృద్ధి పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకుతున్నారని ఘాటుగా ఆరోపించారు.నియోజకవర్గంలో ఉన్న ఒక్క మండలం కూడా సరైన అభివృద్ధికి నోచుకోలేదని గత ప్రభుత్వ పాలకులను విమర్శించారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా అభివృద్ధి ఏమి జరగలేదని గుర్తు చేశారు.గత పాలకుల వల్ల ఎక్కడ ఉన్న సమస్యలు అక్కడే ఉన్నాయని తెలియజేశారు.ఏ మండలం చూసిన ప్రజలు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని మున్సిపాలిటీ వార్డులు,గ్రామ పంచాయితీలలో పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకున్నాని తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఫోకస్ పెట్టానని,ప్రతి ఏరియాలో ప్రజలకు ఏ సమస్య రాకుండా చూస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.సీఎంతో కోట్ల డైనా సరే నియోజకవర్గ అభివృద్ధి కోసం భారీగా నిధులు మంజూరు చేపిస్తానన్నారు.
నియోజకవర్గ అధికారులు ప్రజల కోసం పని చేయాలని,ప్రజా సమస్యలపై దృష్టి సమస్యలను తీర్చాలన్నారు.నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.ప్రజల కోసం పని చేయకుండా,సమస్యలను పట్టించుకోని అధికారులు నియోజకవర్గం నుండి వెళ్లిపోవచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు. పని చేసే అధికారులనే పిలిపించుకొని నియోజకవర్గాన్ని సమస్యలు లేని నిలయంగా చేస్తానన్నారు. అధికారులు ఎవరు పని చేస్తున్నారో..ఎవరు చేయడం లేదో అంత తనకు తెలుసన్నారు.అధికారులకు మరల అవకాశం ఇస్తున్నా..ప్రజల కోసం పని చేసి..ప్రజల సమస్యలను తీర్చాలని అధికారులకు గుర్తు చేశారు.ఇక నుంచి ప్రతి అధికారి ఫోన్ నెంబర్ ప్రజలకు అందిస్తానని ఆయన తెలిపారు. సమస్య ఉన్న చోట ప్రజలు ఆ అధికారికి వెంటనే తెలియజేయాలని ఆయన కోరారు.ఏ అధికారి పట్టించుకోరో ఆ అధికారి గురించి తనకు తెలియజేయాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు.ఈపాదయాత్రలో మండల అధ్యక్షుడు పిరానాకి నవీన్, నాయకులు కోటేశ్వరావు,గాండ్ల సురేష్, చింతల కృష్ణ,బల్లెం సురేష్, శేఖర్,అధికారులు కర్నాటి వెంకటేశ్వర్లు,రామారావు,సతీష్ తదితర అధికారులు పాల్గొన్నారు.