MLA Koona Neni Sambasiva Rao : ప్రతి పల్లెకు పక్కా రహదారికి కృషి

మారుమూల గ్రామాలకు సైతం రహదారి సౌకర్యం

Update: 2024-07-19 13:57 GMT

దిశ, కొత్తగూడెం రూరల్: మారుమూల గ్రామాలకు సైతం రహదారి సౌకర్యం కల్పించి గ్రామీణులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నానని, కొద్దీ రోజుల్లోనే రహదారుల సమస్యలేని గ్రామాలు చేయడమే లక్ష్యమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. లక్ష్మిదేవిపల్లి మండల పరిధిలోని రేగళ్ల గ్రామ శివారులో రూ.3.50కోట్ల వ్యయంతో నిర్మించనున్న హైలెవల్ వంతెన నిర్మాణం లోతువాగు-మాదిగపొలు గ్రామాల మధ్య రూ.12.00లక్షల వ్యయంతో నిర్మించనున్న చప్టా నిర్మాణానికి, రూ.25.00లక్షలతో నిర్మించనున్న పెద్దతండా-మన్యతాండా కాజ్ వే నిర్మాణానికి అదేవిధంగా హేమచంద్రాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.13.50లక్షల వ్యయంతో నిర్మించనున్న సైన్స్ ల్యాబ్ భవనానికి శుక్రవారం కూనంనేని శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటైన శంకుస్థాపన సభలో కూనంనేని మాట్లాడుతూ గ్రామీణ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, పిఎసియస్ డైరెక్టర్, సీపీఐ మండల కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాసరావు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎమ్.వసంత, జగన్మోహన్ రావు, ధర్మరాజు, బోయిన విజయ్ కుమార్, గోవిందు, కుంజా రాంబాబు, ఏఈ మోహన్, డీఈ రామకృష్ణ, ఈఈ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో చలపతిరావు, తహసీల్దార్ కే ఆర్ కే ప్రసాద్, ఎంఈవో జుంకిలాల్, ఏఈ రఘురాం, హెచ్ఎం శ్రీనివాసరావు, స్థానిక నాయకులు దీటి లక్ష్మీపతి, ధనుంజయ్, జలీల్ పాషా, కోడి లింగయ్య, అమర్సింగ్, ఉదయ్ కుమార్, రాంబాబు, కంటెం శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, పూర్ణయ్య, బై కానీ కృష్ణ, ఉపేందర్, అర్జున్ రావు, గుండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News