యువకుడిని హతమార్చిన మావోయిస్టులు

Update: 2022-02-25 05:47 GMT

దిశ, భద్రాచలం : మావోయిస్టులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్ జిల్లాలో గంగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుడియం అర్జున్ అనే యువకుడిని మావోయిస్టులు హత్య చేశారు. ధనోరా గ్రామానికి చెందిన ఇతడిని మావోయిస్టులు దారుణంగా హత్యచేసి మృతదేహాన్ని రెడ్డి‌మార్గ్‌లో పడేశారు. మృతదేహం దగ్గర మావోయిస్టులు గంగలూరు ఏరియా కమిటీ పేరుతో కరపత్రాన్ని పెట్టారు.  ప్రజాశత్రువుగా మారినందుకే అర్జున్‌కి మరణశిక్ష విధించినట్లు లేఖలో పేర్కొన్నారు.  ప్రజాశత్రువులను గుర్తించి పిఎల్‌జీఏ శిక్షిస్తుందని పేర్కొన్నారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై కూంబింగ్ స్టార్ట్ చేశారు.

Tags:    

Similar News