ఎంపీ రఘురాం రెడ్డిని కలిసిన మధ్యాహ్నం భోజన కార్మికులు..
ఖమ్మం జిల్లా మధ్యాహ్న భోజనం కార్మికులు ఖమ్మం పార్లమెంటరీ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డిని మంగళవారం ఖమ్మంలో కలిసి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పై వినతిపత్రం అందించారు.
దిశ, సత్తుపల్లి : ఖమ్మం జిల్లా మధ్యాహ్న భోజనం కార్మికులు ఖమ్మం పార్లమెంటరీ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డిని మంగళవారం ఖమ్మంలో కలిసి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పై వినతిపత్రం అందించారు. వారి సమస్యలను విన్న ఎంపీ రఘురాం రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పై పార్లమెంట్లో ప్రస్తావించి పరిష్కార దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం భోజనం పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు నిమ్మటూరి రామకృష్ణ, ఏఐటీయూసీ జిల్లా కమిటీ సభ్యులు తెలగారపు రామారావు, మధ్యాహ్నం భోజనం వర్కర్ సీనియర్ జిల్లా కమిటీ సభ్యులు షేక్ రహీం, మున్నీసా, జరీనా, శ్రీలక్ష్మి, దేవి సత్యవత, పూసి, సీత, సక్కుబాయి, ఆర్ పీత, జి.రాజ్యలక్ష్మి, రమణ, జే.సీత, తదితరులు పాల్గొన్నారు.