Khammam CP : మంత్రి పర్యటించే ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో నిఘా

గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఖమ్మం జిల్లాలోని వైరా

Update: 2024-08-14 12:47 GMT

దిశ, ఖమ్మం సిటీ : గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఖమ్మం జిల్లాలోని వైరా మండలంలో రుణమాఫీ రైతుసదస్సు కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ భద్రత, బందోబస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కలిసి పరిశీలించారు. వైరాలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ గ్రౌండ్, సభ వేదికను సందర్శించి భద్రతా పరమైన ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో నిఘా, పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లకు అవసరమైన చర్యలపై పోలీస్ అధికారులు, సిబ్బందితో వైరాలోని ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు.

ఎటువంటి సమస్యలు తలెత్తకుండా భద్రత చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపారు. పలు ప్రాంతాల నుండి బహిరంగ సభకు వాహనాలకు, ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, నగర పర్యటన సజావుగా సాగేలా 950 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, సభకు వచ్చే మార్గాలపై అధికారులతో పోలీస్ కమిషనర్ చర్చించారు.కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ నరేష్ కుమార్, అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, ఏసీపీలు సిఐలు పాల్గొన్నారు.


Similar News