రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం : ఖమ్మం సీపీ

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే)ను పురస్కరించుకొని

Update: 2024-10-07 13:46 GMT

దిశ ఖమ్మం సిటీ : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే)ను పురస్కరించుకొని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ , అదేవిధంగా షార్ట్ ఫిల్మ్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడిస్తూ (పోలీస్ ఫ్లాగ్ డే) పోలీస్ అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరిస్తూ ఈనెల 21 న వారోత్సవాలు నిర్వహించబడుతాయని అన్నారు. ఇందులో భాగంగా పోలీసుల త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే ఇటీవల కాలంలో తీసిన (3) ఫోటోలు మరియు తక్కువ నిడివి (3 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ తీసి రాష్ట్రస్థాయి పోటీల కోసం ఈనెల 20వ తేదీ లోపు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సంబంధిత షార్ట్ ఫిల్మ్ లోడ్ చేసిన పెన్ డ్రైవ్, 10 x 8 సైజు ఫోటోలను పోలీస్ పి ఆర్ వో కు అందజేయాలన్నారు.

ఈ పోటీలకు నామినేషన్లు పంపించే ఔత్సహికులు అత్యవసర సమయాల్లో పోలీసులు స్పందన, ప్రకృతి వైపరీత్యాల్లో పోలీసుల సేవ, ఇతర సందర్భాల్లో పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలకు సంబంధించి గత సంవత్సరం 2023 అక్టోబర్ నుండి ప్రస్తుత సంవత్సరం అక్టోబర్ నెల ఇప్పటివరకు తీసిన మూడు ఫోటోలు, షార్ట్ ఫిల్మ్ మాత్రమే పంపించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 8712659256 నెంబర్ ద్వారా పీఆర్ఓ ను సంప్రదించాలన్నారు.


Similar News