జోరు వాన.. అండర్ బ్రిడ్జ్ వద్ద నిలిచిన వరద నీరు

కొత్తగూడెం పట్టణంలో సోమవారం సాయంత్రం పావు

Update: 2024-10-07 14:33 GMT

దిశ, కొత్తగూడెం రూరల్: కొత్తగూడెం పట్టణంలో సోమవారం సాయంత్రం పావు గంట సేపు జోరు వాన కురిసింది. దంచి కొట్టిన వానతో రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వర్షం సమయంలో బ్రిడ్జి మధ్యలో భారీగా వరద నీరు చేరితే రాకపోకలు బంద్ అవుతాయనే భయంతో ఆటోలు కార్లు బస్సులు లారీలు స్పీడ్ గా వెళ్లడం తో నిల్వ ఉన్న వరద నీరు అంతా చిమ్మి ద్విచక్ర వాహనదారులపై పడడంతో వారంతా అసహనం వ్యక్తం చేశారు. వర్షం వస్తే అందరికీ రైల్వే అండర్ బ్రిడ్జితో తిప్పలే అంటూ పలువురు తిట్ల పురాణం కొనసాగించడం గమనార్హం.

అకాల వర్షం రైతులకు మేలు...

కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆదివారం సోమవారం కురిసిన అకాల వర్షం వల్ల రైతులకు మేలేనని రైతు సంఘం నాయకులు పేర్కొనడం జరిగింది. వరి పత్తి మిరప పంటలకు అకాల వర్షం మంచిదేనని అన్నదాతలు సంతోషం వెల్లబుచ్చారు. రెండు రోజులు కురిసిన సాయంత్రం వర్షాలతో ప్రజలకు రోడ్డు మీద ఉండే చిరు వ్యాపారులకు ఉపశమనం లభించినట్లు అయింది.


Similar News