తీవ్ర విషాదం.. షాక్ తగిలి భార్యాభర్తలు మృతి

రాఖీ పౌర్ణమి పండుగ వేళ ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ ఘాతంతో భార్యాభర్తలు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బస్వా పురంలో జరిగింది.

Update: 2024-08-19 08:06 GMT

దిశ, కారేపల్లి: రాఖీ పౌర్ణమి పండుగ వేళ ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ ఘాతంతో భార్యాభర్తలు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బస్వా పురంలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్వా పురానికి చెందిన బాణోత్ సెమినా (36), సోమవారం దండెం పై బట్టలు ఆరవేస్తుండగా కరెంట్ షాక్ తగిలి.. నిచ్చేష్టురాలై ఉండిపోయింది. అది గమనించిన భర్త బాణోత్ శ్రీను(40), ఆమెకు హృదయ సంబంధమైన వ్యాధి ఉండడంతో, అందువల్లే అలా ఉండిపోయిందేమో అనుకొని, మంచం పైకి తీసుకు వద్దామని ఆమెను పట్టుకున్నాడు. అయితే వారు కట్టుకున్న దండెం ఇనుప రాడ్డుకు గాలికి తెగిన వైర్లు అంటుకోవడంతో షాక్ కొట్టి భార్యభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన దంపతులకు ప్రియాంక అనే కూతురు ఉంది. కాగా రాఖీ పౌర్ణమి వేళ భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందడంతో, బస్వాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


Similar News