Godavari floods: గోదావరిలో భారీ వరద.. జలదిగ్బంధంలో పినపాక

తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వర్షాలతో రాష్ట్రంలోని చాలా చోట్ల వాగులు, వంకలు పొంగి పరవళ్లు తొక్కుతున్నాయి.

Update: 2024-07-27 05:52 GMT

దిశ, మణుగూరు: తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వర్షాలతో రాష్ట్రంలోని చాలా చోట్ల వాగులు, వంకలు పొంగి పరవళ్లు తొక్కుతున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో భారీ వర్షాలు కురవడంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో జనజీవనం కొనసాగిస్తున్న గిరిజనుల ఇండ్లు వరద ప్రవహాలలో మునిగిపోయాయి. పలు గ్రామాలు, పట్టణాలు వరద నీటిలో మునిగి, జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అలాగే రోడ్లపైకి భారీ ఎత్తున వరద నీరు చేరుకుంది. కొన్ని గ్రామాలలో రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దీంతో రాష్ట్ర సర్కార్ గోదావరి ముంపు ప్రాంతాలపై ఫోకస్ పెట్టి ఉన్నతాధికారులతో సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టింది. గిరిజనులు వరదలో చిక్కుకుపోకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి తరలించారు. అధికారుల సహాయంతో అన్ని వసతులు కల్పిస్తున్నారు.


Similar News