మహిళల ఆరోగ్యానికి అండగా ప్రభుత్వం : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

కుటుంబ సంక్షేమం, సమాజ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించే మహిళల ఆరోగ్యానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజున అందించిన కానుక ఆరోగ్య మహిళ కార్యక్రమమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

Update: 2023-03-08 14:11 GMT

దిశ, ఖమ్మం : కుటుంబ సంక్షేమం, సమాజ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించే మహిళల ఆరోగ్యానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజున అందించిన కానుక ఆరోగ్య మహిళ కార్యక్రమమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఆరోగ్య మహిళ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆరోగ్య మహిళా కేంద్రంలో మహిళలకు చేసే పరీక్షలు, వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఆరోగ్య మహిళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఈ ఆరోగ్య మహిళ కేంద్రంలో ప్రతి మంగళవారం మహిళలకు పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు చేసి,

     రోగ నిర్ధారణ చేసుకొని తదుపరి వైద్య సేవలను అందిస్తుందని తెలిపారు. ఆరోగ్య మహిళా కేంద్రాల ద్వారా 8 విభాగాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సేవలను అందించడం జరుగుతుందని అన్నారు. అనంతరం మంత్రి రూ. 89 లక్షల వ్యయంతో నిర్మించిన తెలంగాణ డయాగ్నోస్టిక్ రేడియాలజీ హబ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్వేత, రఘునాథపాలెం జెడ్పీటీసీ ప్రియాంక, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. మాలతి, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News