నాలుగు ఎకరాల సుబాబుల తోట దగ్ధం
మండలంలోని రెబ్బవరం గ్రామ శివారులో ఉన్న సుబాబుల్ తోటలో శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
దిశ, వైరా : మండలంలోని రెబ్బవరం గ్రామ శివారులో ఉన్న సుబాబుల్ తోటలో శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రెబ్బవరం గ్రామానికి చెందిన రైతు వల్లభి శ్రీనివాసరావుకు చెందిన నాలుగు ఎకరాల సుబాబుల్ తోటలో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించడంతో స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
మంటలు అదుపు కాకపోవడంతో స్థానికుల సమచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సుమారు నాలుగు ఎకరాల మేర మంటలు వ్యాపించడంతో రూ. 3 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపాడు. అదే విధంగా అష్టగుర్తి శివారులో వెంపటి వెంకటరమణకు చెందిన మొక్కజొన్న దంటులో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించటంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.