రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలి
రైతులు తక్కువ నీటితో ఎక్కువ పంటలను సాగు చేసే వాటిపై దృష్టి సారించాలని అదేవిధంగా పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ముజామిల్లా ఖాన్ అన్నారు.

దిశ, ఖమ్మం రూరల్: రైతులు తక్కువ నీటితో ఎక్కువ పంటలను సాగు చేసే వాటిపై దృష్టి సారించాలని అదేవిధంగా పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ముజామిల్లా ఖాన్ అన్నారు. గురువారం మండలంలోని తల్లంపాడు ప్రధాన రహదారి పక్కన గల రైతుల పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ నెల 18 వరకు సాగు నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రైతులు ఆయిల్ పామ్ పంటలను డ్రిప్ ద్వారా పండించే విధంగా రైతులు మొగ్గు చూపాలని కోరారు. ఒకే పంట వేయకుండా వివిధ పంటలు వేసి రైతులు నష్టపోకుండా చూసుకోవాలి అని కోరారు. పంట మార్పిడి, వివిధ పంటలు వేయటం వల్ల ఎక్కువ లాభాలు ఉoటాయని తెలిపారు. రైతులతో పాటు సహాయ వ్యవసాయ సంచాలకులు బి.సరిత, మండల వ్యవసాయ అధికారి (ఇన్చార్జి) వాణి , ఎఈఓ , గ్రామం లోని రైతులు పాల్గొన్నారు.